తెగిపడిన విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు

తెగిపడిన విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు

 

AP39TV న్యూస్ , కూడేరు:

 

విద్యుత్ అధికారుల అలసత్వం… రైతులకు శాపంగా మారింది .వివరాల్లోకి వెళితే… కూడేరు మండలం మరుట్ల -2 వ కాలనీ దగ్గర పెనకచర్ల డ్యాం కు వెల్లే దారిలో రైతు కొనకొండ్ల పెన్నోబులేసు తోటలో 11కేవీ విద్యుత్ లైన్కు ఏర్పాటు చేసిన తీగలు తెగి నేలపై పడ్డాయి. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. విషయాన్ని విద్యుత్ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. తెగిన విద్యుత్ తీగలతో అటుగా వెళ్లే మూగజీవాలు .మనుషులకు విద్యుత్ ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తెగిన విద్యుత్ తీగలకు మరమ్మత్తులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.