దామోదర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
కూడేరు,AP 39 TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని గొటుకూరుకు చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత దామోదర్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి దామోదర్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశలత,ఎంపీపీ నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ వలి పార్టీ నేతలు మదన్మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రామంజి, గోవిందు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు