యోగా చేయడం అలవర్చుకోండి
యోగా చేయడం అలవర్చుకోండి
– వాటర్ షెడ్ ఏ పి డి సుధాకర్ రెడ్డి
AP 39TV న్యూస్ కూడేరు:
ప్రతి ఒక్కరూ యోగ చేయడం అలవర్చుకోవాలని వాటర్ షెడ్డు ఏపీడి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని ముద్దలాపురంలో ఉపాధి సిబ్బందితో కలిసి ఆయన యోగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత బిజీ జీవితంలో యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు .కార్యక్రమంలో వాటర్ షెడ్ పిఓ ఈశ్వరయ్య, టిఏ రమేష్ ,ఉపాధి హామీ టిఏ లక్ష్మీనారాయణ ,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
కుడేర్ రిపోర్టర్