కడదరకుంటలో లేగ దూడల ప్రదర్శన
కడదరకుంటలో లేగ దూడల ప్రదర్శన
AP39TV న్యూస్ , కూడేరు:
కూడేరు మండలం కడదరగుంట గ్రామంలో శనివారం మండల పశు వైద్యాధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ సుధాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారిత వీర్యం వాడకంతో 90 శాతం ఆడదూడలు పుట్టే అవకాశాలున్నాయన్నారు. లింగ నిర్ధారిత వీర్యం రెండు ఇంజక్షన్లు రూ.1350, సబ్సిడీ రూ. 850 పోగా 500 రూపాయలు పశువుల పెంపకం దారులు చెల్లిస్తే చాలన్నారు. ఒకవేళ పశువు గర్భం దాల్చకపోతే రూ.500 తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుందన్నారు .మగదూడ పుడితే రూ.250 వెనక్కి ఇస్తామన్నారు. ముర్రు పాల ప్రాముఖ్యత, ఉచిత నట్టల నివారణ మందుల గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి శ్రీనివాసులు, గోపాల మిత్రులు ధనుంజయ , ప్రమీలమ్మ ,రాఘవ ,రైతులు తదితరులు పాల్గొన్నారు.