రైతులు ఆర్థికంగా ఎదగాలి -ప్రణయ్ కుమార్ రెడ్డి
రైతులు ఆర్థికంగా ఎదగాలి
-ప్రణయ్ కుమార్ రెడ్డి
AP 39 TV న్యూస్ కూడేరు:
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం చెందాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ ప్రణయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు . మంగళవారం కూడేరు మండలం కలగళ్లలో వాటర్ షెడ్ పథకం కింద సబ్సిడీతో మంజూరైన స్ప్రేయర్లు , టార్పాలిన్లు, స్ప్రింక్కర్లు, పివిసి పైపుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటర్ షెడ్ కింద గ్రామానికి దాదాపు రూ.4.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ ఏడాది సుమారు రూ. 45 లక్షలతో ట్రాక్టర్ పని ముట్లు, టార్పాలిన్లు, స్ప్రేయర్లు , స్ప్రింకర్లు, పివిసి పైపులు వంటి వ్యవసాయ పనిముట్లను మంజూరు చేసిందన్నారు.రైతులు వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వాటర్ షెడ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ,సర్పంచ్ సువర్ణమ్మ ,ఎంపీటీసీ ఓబులమ్మ ,ఎంపీపీ నారాయణరెడ్డి , జెడ్పిటిసి సభ్యురాలు అశ్విని , వైస్ ఎంపీపీ దేవా ,వైయస్సార్ సిపి నేతలు దేవేంద్ర ,బైరెడ్డి రామచంద్రారెడ్డి ,రాచన్న గౌడ్, హేమ సుందర్ ,ధనుంజయ , చిదంబరం ,గంగాధర్ , హనుమంత రెడ్డి ,మదన్ మోహన్ రెడ్డి ,సుబ్బయ్య, , సిద్ధారెడ్డి , అక్కులన్న ,శంకరయ్య, నాగరాజు ,నీలకంఠ రెడ్డి,,డ్వామా టీఓ విశ్వనాథరెడ్డి, ఆగ్రోస్ ప్రతినిధి శర్మ, ఆర్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.