విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం దళిత నేతలు ప్రచారం

విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం దళిత నేతలు ప్రచారం

 

కూడేరు మార్చి 3 (AP 39 TV న్యూస్):-

ఉరవకొండ నియోజకవర్గ అసెంబ్లీ వైఎస్సార్ సీపీ. అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ దళిత నేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం కూడేరు మండలం పరిధిలోని కరుట్లపల్లి, కూడేరులో ఇంటింటికి వెళ్లి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధికి సంబంధించిన పత్రాలను అందజేశారు ప్రజల కోసం విశ్వేశ్వర్ రెడ్డి చేసిన కృషిని వివరించారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను వారు అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీ కి ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కమ్మూరు సంగప్ప కరుట్లపల్లి ఆక్కులన్న, కూడేరు ఈశ్వరయ్య, ఎర్ర నాగప్ప, సంగప్ప, జైపురం సంజీవ రాయుడు తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.