ఎన్నికల నిర్వహణపై సమీక్షించిన జేసి
ఎన్నికల నిర్వహణపై సమీక్షించిన జేసి
కూడేరు,మార్చి28(AP 39 TV న్యూస్):-
ఎన్నికల నిర్వహణపై జిల్లా జాయింట్ కలెక్టర్ ,ఉరవకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ కార్గ్ గురువారం కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్షించారు. సెక్టారు, రూట్, మండల స్థాయి అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పైన రూటు పైన సెక్టార్ రూట్ ఆఫీసర్లకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం కూడేర్లు మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటుచేసిన SST చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు వాహనాల తనిఖీ విస్తృతంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు . కార్యక్రమంలో తహాసిల్దార్ రత్న రాధిక, ఎంపీడీవో ఎంకే భాషా ,డిటి విశ్వనాథ్ ,మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు