మంచినీరు ,విద్యుత్ సౌకర్యం తప్పకుండా ఉండాలి

మంచినీరు ,విద్యుత్ సౌకర్యం తప్పకుండా ఉండాలి

-హౌసింగ్ పిడి కేశవ నాయుడు

AP39TV న్యూస్ ,కూడేరు:

 

కూడేరులోని కేజీబీవీ వద్ద ఉన్న జగనన్న లే-అవుట్ ను శనివారం హౌసింగ్ పీడీ కేశవ నాయుడు సందర్శించారు. ఇంటి నిర్మాణాల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాలను తొందరగా నిర్మించుకునేలా చూడాలని మండల సిబ్బందికి సూచించారు. సుమారు 20 మంది దాకా ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . వారు ఇంటి నిర్మాణాలు చేపట్టకపోతే వారి పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు .కొందరు లబ్ధిదారులు మంచినీరు, విద్యుత్ సౌకర్యం సరిగా లేదని తెలపడంతో వెంటనే ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. మంచినీరు విద్యుత్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి , ఇంచార్జ్ జెడ్పి సీఈవో అమృతరాజ్ , హౌసింగ్ డిఈ హనుమప్ప , ఆర్డబ్ల్యూఎస్ డిఈ షఫ్రినా, తహసిల్దార్ సక్సేనా , ఎంపీడీఓ ఎంకే భాషా ,పిఆర్ ఏఈ శ్రీనివాసులు ,హౌసింగ్ ఏఈ శేఖర్ ,ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఫాతిమా, సెక్రెటరీ రఘు వీఆర్వోలు ,వలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.