కూడేరులో జనాల్లోకి ఎలుగుబంటి
కూడేరులో జనాల్లోకి ఎలుగుబంటి
AP39 TV న్యూస్ కూడేరు:
కూడేరు మండల పరిధిలోని రామచంద్రపురం ,స్కంద, బ్రాహ్మణపల్లి జనవాసాల్లోకి సోమవారం సాయంత్రం ఎలుగుబంటి వచ్చింది .తొలత రామచంద్రపురంలో నారాయణ అనే రైతు అరటి తోటలో ఎలుగుబట్టి ఉండగా భయపడి వారు శబ్దాలు చేయడంతో అక్కడి నుండి స్కందా వైపు వచ్చింది. ప్రజలు భయాందోళనలతో ఎస్ఐ సత్యనారాయణ కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు .అది నిదానంగా పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. విషయాన్ని ఎస్సై ఫారెస్ట్ అధికారులకు చెప్పారు.
పవన్ కుమార్
రిపోర్టర్
Kuderu