ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి
కూడేరు,మార్చి 6(AP 39 TV న్యూస్):-
సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధిని చేకూర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ వాల్మీకి సామాజిక నేతలు కోరారు. వారు కూడేరు మండలం కరట్లపల్లిలో బుధవారం పర్యటించారు .బోయల ఇంటికి వెళ్లి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధిని , మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు .నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఉదిరిపికొండ నరేష్, మరుట్ల సత్యనారాయణ.ఇప్పేరు కేశన్న. కొర్రకోడు గంగాధర. కరట్లపల్లి చిన్న నరసింహులు. ఆనంద్. ఎంసీ అంజనేయులు, జయప్ప. బాలఅక్కలన్న. గోపాల్ ,జల్లిపల్లి నరేష్. కోర్రకోడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు