మెనూ ప్రకారం భోజనం నాణ్యతగా ఉండాలి
మెనూ ప్రకారం భోజనం నాణ్యతగా ఉండాలి
– సర్పంచ్ ఓబులమ్మ
కూడేరు (సెప్టెంబర్ 14)AP 39TV న్యూస్:-
మెనూ ప్రకారం భోజనం నాణ్యతగా ఏర్పాటు చేసి పిల్లలకు పెట్టాలని సర్పంచ్ ఓబులమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఆమె సూచించారు. గురువారం మండల పరిధిలోని కరుట్లపల్లి హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆమె పిల్లలకు ఏర్పాటు చేసిన భోజన నాణ్యతను పరిశీలించారు. భోజనం నాణ్యత పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్య బోధనపై కూడా ఆరా తీశారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు