రైతులకు రుణాలు అందిస్తామని తెలిపిన కెనరా బ్యాంక్ మేనేజర్
రైతులకు రుణాలు అందిస్తామని తెలిపిన కెనరా బ్యాంక్ మేనేజర్
Ap39tv న్యూస్ జులై 21
గుడిబండ మండల పరిధిలోని మందలపల్లి కెనరా బ్యాంక్ పరిధిలోని రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నామని ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థిక స్వావలంబన సాధించాలని మందలపల్లి కెనరా బ్యాంక్ మేనేజర్ మణికుమార్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందలపల్లి కెనరా బ్యాంక్ పరిధిలోని పాడి పశువులు, గొర్రెలు, కోళ్ళ ఫారాలు లాంటి స్వయం ఉపాధి రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నామని అలాగే రైతులు గ్రూపులుగా ఏర్పడితే వారికి కూడా గ్రూపు రుణాలు మంజూరు చేస్తామని కావున రైతులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు షబ్బీర్,నంజుండయ్య,దాసప్ప తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39 tv
మడకశిర ఇన్చార్జ్ గుడిబండ