గల్లంతైన ఆర్య మృతదేహం లభ్యం

గల్లంతైన ఆర్య మృతదేహం లభ్యం

 

కూడేరు, AP 39 TV న్యూస్:-

 

ఉరవకొండకు చెందిన ఆర్య(20) అనే యువకుడు 6 మంది స్నేహితులతో కలిసి ఆదివారం మండల పరిధిలోని పెనకచర్ల డ్యాంలో సరదాగా తెప్పలో తిరుగుతుండగా కిందపడి గల్లంతయిన విషయం తెలిసిందే. ఎస్ఐ సత్యనారాయణ ,పోలీస్ అగ్నిమాపక సిబ్బంది కలిసి ఆదివారం ,సోమవారం, గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించలేదు. మంగళవారం గాలింపు చర్యలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ముమ్మరం చేశారు. 4 గంటల సమయంలో ఆర్య మృతదేహం బయటపడింది .కుటుంబ సభ్యులు ఆర్య మృతదేహం పై పడి బోరున విలపించారు .ఎస్సై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.