కూడేరులో పెద్దమ్మ దేవతకు ప్రత్యేక పూజలు
కూడేరులో పెద్దమ్మ దేవతకు ప్రత్యేక పూజలు
కూడేరు(AP 39 TV న్యూస్):-
కూడేరులో స్టేట్ బ్యాంకు దగ్గర ఉన్న పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం పెద్దమ్మ దేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .ఇటీవల ఆలయంలోకి దుండగులు చొరబడి నగదు ఎత్తుకెళ్లి విగ్రహాన్ని కదిలించారు. దీంతో అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు. ప్రతిష్ట కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలకు ఆలయం తరఫున అన్నదానం చేశారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.