యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాతో “సంపూర్ణ ఆరోగ్యం’
-ఎన్ సీ సీ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కల్నల్ సందీప్ ముంద్ర
AP 39TV న్యూస్ , కూడేరు:
యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్ సీసీ నగర్ లో జరుగుతున్న 6 ఆంధ్ర బెటాలియన్ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కల్నల్ సందీప్ ముంద్రా పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ సీ సీ అధికారులు మణిపాల్ స్కూల్లో సుమారు వెయ్యి మందితో కలిసి యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి, రక్తపోటు ,మధుమేహాన్ని తగ్గించుకోవచ్చన్నారు.గుండె పనితీరును మెరుగుపరుచుకోవచ్చన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ చేయడం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ సుఖ్ దేవ్ సింగ్ , రాకేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు