ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం సురక్షితమని చెప్పండి
– జిల్లా వైద్యాధికారి వీరబ్బాయి
AP39 TV న్యూస్ ,కూడేరు:
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం సురక్షితమని గ్రామీణ ప్రాంత గర్భిణీలకు చెప్పి .. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం పొందేలా చూడాలని జిల్లా వైద్యాధికారి వీరబ్బాయి మండల వైద్య సిబ్బందికి ఆదేశించారు .శనివారం ఆయన కూడేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆయన సిబ్బంది , ఓపి , మందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. తర్వాత ల్యాబ్ను , కాన్పుల గది, రోగుల వార్డులను పరిశీలించారు . కాన్పుల, రోగుల వార్డులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు .ప్రతి నెల 10 ప్రసవాలు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగేలా చూడాలని సూచించారు. తర్వాత ఆయన ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ సుజాత ,మండల వైద్యాధికారి సరిత ,సిహెచ్ఓ మోహన్ బాబు, సూపర్ వైజర్లు రవీంద్ర ,దేవకర్ణమ్మ ,ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్ , ఎంఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు.