ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య 

-సర్పంచ్ నాగమ్మ

AP 39TV న్యూస్ కూడేరు:

 

వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందని ఉదిరిపికొండ సర్పంచ్ నాగమ్మ పేర్కొన్నారు. సోమవారం ఉదిరిపికొండలోని ప్రాథమికోన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు .పిల్లలు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తును పొందాలని ఆమె సూచించారు .కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ,పిల్లల తల్లిదండ్రులు ,స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.