ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోండి
సర్పంచ్ కరుణాకర్ గౌడ్
Ap39tv న్యూస్ జులై 27
గుడిబండ గ్రామ సచీవాలయం 1 లో జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్ధానిక సర్పంచ్ కరుణాకర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 11 రకాల సేవలను గుడిబండ పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ సన్న నింగమ్మ డిప్యూటీ తహశీల్దార్ రామ్ భూపాల్ రెడ్డి ఈఓఆర్డి నాగరాజు నాయక్,సచీవాలయ సిబ్బంది రాజేంద్ర, గిరి,గోవిందప్ప ఎంపీటీసీలు వనజ శశిధర్ పాత లింగప్ప తదితరులు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
మడకశిర ఇంచార్జీ
గుడిబండ