విజ్ఞానాన్ని పెంపొందించడమే “గ్రంథాలయాల ” లక్ష్యం
విజ్ఞానాన్ని పెంపొందించడమే “గ్రంథాలయాల ” లక్ష్యం
– కూడేరు గ్రంథాలయాధికారిని రాధా రాణి
AP 39TV న్యూస్ కూడేరు:
విద్యార్థులు , ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందించడమే గ్రంథాలయాల లక్ష్యమని కూడేరు గ్రంథాలయ అధికారిని రాధా రాణి పేర్కొన్నారు .గత నెల 8న ప్రారంభమైన సమ్మర్ క్యాంపు కార్యక్రమం ఆదివారంతో ఘనంగా ముగిసింది .ముగింపు సందర్భంగా కూడేరులోని గ్రంథాలయంలో అధికారిని విద్యార్థులు సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడం జరిగిందన్నారు. ముఖ్యంగా చిన్న తనం నుంచి దేశభక్తి సేవా గుణం అలవర్చుకునే విధంగా చైతన్య పరచడం జరిగిందన్నారు. గ్రంథాలయంలో ఉండే విలువైన పుస్తకాల గురించి వివరించామన్నారు. కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రంగయ్య , పాఠకులు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు