కూడేరులో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
-సాయిబాబాను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
AP 39TV ,న్యూస్ కూడేరు:
కూడేరులో ప్రసిద్ధిగాంచిన షిరిడి సాయిబాబా ఆలయంలో సోమవారం గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.మండల పరిధి నుంచి కాకుండా జిల్లా కేంద్రం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. అలాగే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విచ్చేసి షిరిడి సాయినాధుని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు విశ్వేశ్వరరెడ్డిని సన్మానించారు. ఆలయ ట్రస్ట్ తరఫున భక్తులకు అన్నదానం చేశారు. భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోకుండా ప్రధాన.. రహదారిపై వాహన దారులకు ఇబ్బంది లేకుండా ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు . కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, ఆ పార్టీ నేతలు చు బైరెడ్డి రామచంద్రారెడ్డి, మంజునాథ్ రెడ్డి , ఆలయ ట్రస్ట్ చైర్మన్ భారతి ,సభ్యులు వెంకటరెడ్డి , తాతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు