ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివారెడ్డి

అనంతపురం AP 39 TV:

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివారెడ్డి కోరారు. అనంతపురం నగరం లో ఏపీ ఎన్జీవో భవన నిర్మాణ భూమి పూజకు ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆడిట్ శాఖ డైరెక్టర్ ప్రకాష్ తన సొంత జాగీర్ లాగా ఇష్టం వచ్చినట్లు ఆడిట్ శాఖ ను నడుపుతున్నారని జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ఇష్టం వచ్చినట్లు ట్రాన్స్ఫర్ చేయడం సరికాదని అదేవిధంగా జీవో నెంబర్ 126 ప్రకారం ఏ జిల్లాలో పనిచేస్తే అక్కడే వేయాలని ఏపీ ఎన్జీవోలను ఇష్టం వచ్చినట్లు జోన్లకు మార్చడం 90 సంవత్సరాలు అక్కడే పని చేయాలని గవర్నమెంట్ జీవో ఉన్న కూడా కాదని 26 మంది ఇష్టం వచ్చినట్లు మార్చడం జరిగిందని అతని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని 26 మందిని వెంటనే బదిలీలు ఆపి తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా , రాజమండ్రిలో కోర్టుకు వెళితే అదే రోజు యధావిధిగా అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చారని వాళ్లకు ఒక రూల్ మనకు ఒక రూల్ ఉంటుందా బదిలీలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మీడియాతో తెలిపారు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగానే స్పందిస్తున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉద్యోగులకు ఆయన తెలిపారు. అయితే సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి జగన్ జీవో విడుదల చేసి సకాలంలో పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 21, 22 తేదీలలో విజయవాడలో ఏపీ ఎన్జీవో స్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, దీనికి ముఖ్య మంత్రి జగన్ హాజరవుతారని ఆయన చెప్పారు. కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఏది ఏమైనా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

 

Chiranjeevi

AP 39 TV, Reporter, Anantapur

 

Leave A Reply

Your email address will not be published.