వికలాంగ పిల్లలకు బోదనోపకరణాలు పంపిణీ
కూడేరు(AP 39TV న్యూస్):-
కూడేరు , కణేకల్ ఆర్డిటి స్కూల్స్ లో ఉన్న 45 మంది వికలాంగుల పిల్లలకు మంగళవారం సికింద్రాబాద్ కు చెందిన జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ప్రతినిధులు బోధనోపకరణాలు పంపిణీ చేశారు .సుమారు 50 వేలు విలువ చేసే బోధనోపకరణాలను అందించారు.ఈ బోధనోపకరణాలుతో పిల్లల మానసిక పరిపక్వతకు ఎంతగానో ఉపయోగపడతాయని సంస్థ ప్రతినిధులు అంజిరెడ్డి అన్నారు .బోధనోపకరణాలను ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశం పైన పిల్లల తల్లిదండ్రులకు సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రత్యేక ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ యుగంధర్ నాయుడు జరిగింది. కనేకల్ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏర్రిస్వామి , కూడేరు,కణేకల్ సెంటర్ మేనేజర్స్ షణ్ముఖరావు, సిస్టర్ మయూరి , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు