కూడేరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
కూడేరు,జూన్ 1 (AP 39 TV న్యూస్):-
హనుమాన్ జయంతి వేడుకలను కూడేరు మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కూడేరులోని శ్రీ కోదండరామ ఆలయంలో ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు భాస్కర్ శర్మ కుంకుమార్చన, పంచామృత అభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కూడేరులోని ఆంజనేయస్వామి ,బసాపురం ఆంజనేయస్వామి, అంతరగంగా తోపాటు మరికొన్ని గ్రామాల్లోని ఆలయాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు .ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానము చేశారు. సాయంత్రం బసాపురం ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాన్ని కూడేరు గ్రామపుర వీధుల్లో ఊరేగింపు చేశారు.ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి నామస్మరణ మార్మోగింది.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.