గుండెపోటుతో యువరైతు మృతి
మరుట్లలో గుండెపోటుతో యువరైతు మృతి
-ఆర్థిక ఇబ్బందులే కారణమన్న కుటుంబ సభ్యులు
కూడేరు(అక్టోబర్ 12)AP 39 TV న్యూస్:-
కూడేరు మండలం మరుట్ల రెండవ కాలనీకి చెందిన కమ్మర రఘు (21) అనే యువ రైతు గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఇతనికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. పంట పెట్టుబడులకు ,కుటుంబ పోషణకు చేసిన అప్పులతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై మానసిక ఒత్తిడికి గురి కావడంతో గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య శివలక్ష్మి ,ఏడాది వయసు ఉన్న కూతురు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు