గుండె పోటుకు గురై రైతన్న మృతి
తాడిపత్రి AP39 టీవీ:
బ్యాంకులో పంట రుణాలు రెన్యువల్ చేసేందుకు వెళ్లి సంతకం చేసిన తరువాత గుండె పోటుకు గురై రైతన్న మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పుట్లూరు మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో శనగలగూడూరు గ్రామానికి చెందిన రైతు వెంకటరామిరెడ్డి మంగళవారం పంట రుణాలు రెన్యువల్ చేసుకోవడానికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.