ఆస్పత్రి అభివృద్ధి నిధుల వినియోగంపై సమీక్ష
కూడేరు(AP 39 TV న్యూస్):-
కూడేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆసుపత్రి అభివృద్ధి నిధులు వినియోగంపై సమీక్ష నిర్వహించారు .ఈ కార్యక్రమానికి చైర్మన్ ఎంపిపి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి నిధులను అత్యవసరమైన మౌలిక వసతులకు ఖర్చు పెట్టాలని సూచించారు. రోగులు సౌకర్యాలు లేక ఇబ్బంది పడకూడదన్నారు .ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని ..ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగభూషణ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు