పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు

 

-జడ్పిటిసి సభ్యురాలు తుప్పటి అశ్విని

 

కూడేరు(అక్టోబర్ 10)AP39TV న్యూస్ :-

ప్రజారోగ్య సంరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న “జగనన్న ఆరోగ్య సురక్ష ” పథకంతో పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని కూడేరు మండల జడ్పిటిసి సభ్యురాలు తుప్పటి అశ్విని పేర్కొన్నారు .మంగళవారం కూడేరులోని సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు . పేదల వద్దకే వైద్య నిపుణులు వచ్చి సేవలందించడం గర్వించదగ్గ విషయమన్నారు .ఈ కార్యక్రమం ప్రజలకు వరంగా నిలుస్తుందన్నారు .కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా క్షయ, కుష్టు నివారణ అధికారి అనుపమ జేమ్స్ పరిశీలించారు .ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .సుమారు 600 మంది దాకా వైద్య సేవలు పొందారు .ప్రజలకు ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు వెంకట లక్ష్మమ్మ , సర్పంచ్ లలితమ్మ ,వైస్ ఎంపీపీలు దేవా ,సుబ్బమ్మ ,కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ వలి , వైద్యులు సరిత , లక్ష్మీనారాయణ , ఎంపీడీవో ఎంకే బాషా , ఈఓఆర్డి లక్ష్మీ నరసమ్మ ,సిహెచ్ఓ వరలక్ష్మి , సూపర్ వైజర్ రవీంద్ర , ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్, MLHP లు , ANM లు, ఆశ వర్కర్లు, పంచాయితీ కార్యదర్శులు శివరంజని , రఘురాం, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు ,వైఎస్సార్ సీపీ నేతలు విజయ భాస్కర్ రెడ్డి , రామాంజనేయులు , ఎర్ర నాగప్ప ,శివ , జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.