హోంగార్డుకు గాయాలు
హోంగార్డుకు గాయాలు
కూడేరు (ఆగస్టు 31)AP 39TV న్యూస్:-
కూడేరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు నరసింహులు రోడ్డు ప్రమాదానికి గురికాగా గాయాల పాలయ్యాడు. గురువారం ఆయన విధుల్లో భాగంగా పోలీస్ స్టేషన్ నుంచి ఉరవకొండలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ఉరవకొండ మండలం చిన్న ముస్టురు వద్ద ప్రధాన రహదారిపై జింక అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. గాయాల పాలైన అతనిని స్థానికులు 108 లో అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు