కూడేరులో పండగల సామూహిక గృహ ప్రవేశాలు

కూడేరులో పండగల సామూహిక గృహ ప్రవేశాలు

-సొంతింటి కల నెరవేరడంతో ఆనందంలో పేదలు

 

కూడేరు(అక్టోబర్ 12) AP 39 TV న్యూస్:-

 

కూడేరులోని జగనన్న కాలనీ-2లో గురువారం నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం పండగల సాగింది. సొంతింటి కల నెరవేరడంతో పేదలు ఆనందం వ్యక్తం. కార్యక్రమానికి ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీడీవో ఎంకే బాషా ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన పక్కా గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు.అందుకే అడిగిన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు మంజూరు చేసి సొంతింటి కల నెరవేర్చడం జరిగిందన్నారు. ఇంకా అర్హత ఉండి పక్క ఇల్లు మంజూరు కాకపోతే అటువంటి వారికి కూడా పక్కా ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే మండలానికి సుమారు 1400 గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శేఖర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, వాలంటీర్లు , వైస్ ఎంపీపీ దేవా, వైయస్సార్ సిపి మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, నేతలు తిమ్మారెడ్డి ,భాస్కర్ రెడ్డి , రామాంజనేయులు , ఎర్ర నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.