అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
-సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
-సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కొసం భూ ఆక్రమణ
AP 39TV న్యూస్,కూడేరు:
అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం
మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి పొలం సర్వేనెంబర్ 11 లో 8 ఎకరాల 11 సెంట్లలో గల వంక పోరంబోకు భూమిని సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమించారు.కమ్మూరు, బ్రాహ్మణపల్లి ,గొట్కూరు పొట్టి చెరువు ,కూడేరు ,అరవకూరు తదితర గ్రామాల ఇల్లు లేని నిరుపేదలు పాల్గొన్నారు.భూ పోరాటం చేశారు. జిల్లా కార్యదర్శి జాఫర్ పార్టీ నేతలు నిరుపేదలు ఆ పొలంలో చెట్లను నరికివేసి జెండాలు పాతారు.సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన.కార్యదర్శి. కేశవరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై ఎల్ రామాంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి కురుగుంట మనోహర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెరుగుసంగప్ప,చిన్న రాయుడు, సిపిఐ నియోజకవర్గ నాయకులు, సుల్తాన్,రమణ,సిపిఐ మండల కార్యదర్శి నారాయణమ్మ, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు పార్వతి ప్రసాద్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నారాయణప్ప,నబి సాహెబ్, మండల నాయకులు ముట్టాల శ్రీరాములు, రమణప్ప, మల్ల రాయుడు, ప్రసాద్, వెంకటేష్, కాసిం పిర, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు