ఇంటర్లో కేజీబీవీ టాపర్ బి. మానస
ఇంటర్లో కేజీబీవీ టాపర్ బి. మానస
కూడేరు,ఏప్రిల్ 12 (AP 39 TV న్యూస్):-
ఇంటర్మీడియట్ మొదటి రెండవ సంవత్సరం ఫలితాలు శుక్రవారం వచ్చాయి. కూడేరు కేజీబీవీ విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. రెండవ సంవత్సరంలో బి.మానస 963(1000కి) మార్కుల సాధించి టాపర్గా నిలిచినట్లు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఉమాదేవి తెలిపారు. అలాగే జి. వైశ్యాలి 957, జె. వెన్నెల 952 మార్కులు సాధించినట్లు ఆమె తెలిపారు. ఫస్ట్ ఇయర్లో ఎం శిరీష 399 (440కి), బి. లావణ్య 396, ఆర్. కావ్య 386 మార్కులు సాధించినట్లు ఆమె చెప్పారు. రెండవ సంవత్సరంలో మొత్తం 31 మందికి గాను 31 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె చెప్పారు అలాగే ఫస్ట్ ఇయర్ లో 30 మందికి గాను 27 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన బాలికలను ప్రత్యేక అధికారిణి , ఉపాధ్యాయునిలు అభినందించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు