*ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు*
*నగర మేయర్ మహమ్మద్ వసీం*
అనంతపురం.
నగరంలో ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించవద్దని నగర మేయర్ మహమ్మద్ వసీం సిబ్బందికి సూచించారు. నగరంలోని 48వ డివిజన్ లో గురువారం నగర మేయర్ మహమ్మద్ వసీం పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని, ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లాప్ కార్యక్రమాన్ని నగరంలో పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేపట్టాలని ఆ దిశగా సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా అవగాహన కల్పించాలని ఏ ఇంటి ముందు రోడ్డుపై చెత్త వేయకుండా చూడాలని సూచించారు. ఒకవేళ చెత్త సేకరించే వాహనాలు మరమ్మత్తులకు గురి అయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలే కానీ చెత్త సేకరణను ఆపకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అనంతరం రెండో రోడ్ లోని మిత్రా హోటల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న రోప్ లైట్ పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీనివాసులు,శేఖర్ బాబు,టివి.చంద్రమోహన్ రెడ్డి, ఎంహెచ్ఓ గంగాధర్ రెడ్డి, నాయకుడు ఖాజా తదితరులు పాల్గొన్నారు.