జగనన్న సురక్ష కార్యక్రమంలో వైయస్సార్ బీమా అందజేత
జగనన్న సురక్ష కార్యక్రమంలో వైయస్సార్ బీమా అందజేత
AP3TV న్యూస్ జులై 22
గుడిబండ మండల పరిధిలోని మోరబాగల్ గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 11 రకాల ఉచిత సేవలను అర్హులైన లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎంపీడీవో రామారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా అందిస్తున్న 11 రకాల ఉచిత సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఇటీవల మృతి చెందిన హనుమంతరాయప్ప కు సంబంధించిన వైయస్సార్ బీమా తక్షణసాయంగా పదివేల రూపాయలు భార్య చంద్రమ్మకు సర్పంచ్ తిప్పేస్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామారావు,సర్పంచ్ తిప్పేస్వామి, మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణప్ప, డిప్యూటీ తహశీల్దారు రామ్ భూపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్, మండల వాలంటీర్స్ యూనియన్ అధ్యక్షుడు యంజరప్ప ,ఓంకార్, మంజునాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV
మడకశిర ఇంచార్జ్ గుడిబండ