పేద ప్రజలకు “జగనన్న ఆరోగ్య సురక్ష “ఓ వరం
పేద ప్రజలకు “జగనన్న ఆరోగ్య సురక్ష “ఓ వరం
-ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
కూడేరు(అక్టోబర్ 3) AP 39 TV న్యూస్:-
పేద కుటుంబాలకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న “జగనన్న ఆరోగ్య సురక్ష “పథకం వరంగా నిలుస్తుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కూడేరు మండల పరిధిలోని గొటుకూరులో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ముంగిటికే వెళ్లి నాణ్యమైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గ్రామాల్లోని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిపుణుల చేత నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వించదగ్గ విషయం అన్నారు . ప్రజలందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం నిపుణులు ప్రజలకు సిద్ధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశాలత ,ఎంపీపీ నారాయణరెడ్డి ,స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, చౌదరి తహసీల్దార్ శేషారెడ్డి , ఎంపీడీవో ఎంకే భాషా ,డాక్టర్లు సరిత , లక్ష్మీనారాయణ, వైయస్సార్ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి , నేతలు తుప్పటి హరీష్ ,మదన్ మోహన్ రెడ్డి ,హనుమంత రెడ్డి , రామాంజనేయులు , నాగేశ్వర్రెడ్డి ,సూరి , కృష్ణారెడ్డి సర్దార్ వలి ,సిద్ధారెడ్డి , భాస్కర్ రెడ్డి వెంకటరామిరెడ్డి, ఈఓఆర్డి లక్ష్మీనరసమ్మ, , పంచాయితీ కార్యదర్శులు మురళి, ప్రశాంత్ ,వైద్య, సచివాలయ ,అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు