జగనన్న ఆరోగ్య సురక్ష .. ప్రజల ఆరోగ్యానికి రక్ష
జగనన్న ఆరోగ్య సురక్ష .. ప్రజల ఆరోగ్యానికి రక్ష
-ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
కూడేరు (అక్టోబర్ 7)AP 39 TV న్యూస్:-
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రజల ఆరోగ్యానికి భద్రత లభిస్తోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కూడేరు మండలం కొర్రకోడులో సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ అధ్యక్షతన జగనన్న ఆరోగ్యం సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీపీ నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈసందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్షతో వైద్య నిపుణులు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రజలకు ఓ వరంగా నిలుస్తోందన్నారు .ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు . వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది సుమారు 400 మంది దాకా ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సిపి వీరన్న, సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డి సింగల్ విండో ప్రెసిడెంట్ గంగాధర్ వైస్ ఎంపీపీ దేవా,మండలం స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ చౌదరి తహసీల్దార్ శేషారెడ్డి , ఎంపీడీవో ఎంకే భాషా,
వైద్యులు సరిత , లక్ష్మీనారాయణ ,mlhp లు శ్రీవిద్య ,లోకేశ్వరి ,మీనాక్షి, సూపర్వైజర్ రవీంద్ర , ల్యాబ్ టెక్నీషియన్ ,వేణుగోపాల్
ఆర్ఐ ప్రసన్నకుమార్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి సచివాలయ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.