పేదల పక్షపాతి సీఎం జగన్
-ఎంపీపీ నారాయణ రెడ్డి
.-p.నారాయణపురంలో జగనన్న ఆరోగ్య సురక్షకు విశేష స్పందన
కూడేరు (అక్టోబర్ 20)AP 39 TV న్యూస్:-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి . పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తూ పేదల ముంగిటకే కార్పొరేట్ వైద్య సేవలను అందిస్తున్నాడని ఎంపీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం పి నారాయణపురం గ్రామంలో సర్పంచ్ హనుమంత రెడ్డి అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .వైద్యం కోసం ప్రజల పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యక్రమంలో వైయస్సార్ సిపి మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, తహాసిల్దార్ శేషారెడ్డి, వైద్యులు సరిత ,లక్ష్మీనారాయణ , సూపర్వైజర్ రవీంద్ర , ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్ , పంచాయతీ కార్యదర్శి హరి , వైయస్సార్ సిపి నేతలు , వైద్య సచివాలయ సిబ్బంది,ప్రజలు తదితరులు పాల్గొన్నారు
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు