దళిత పక్షపాతి సీఎం జగన్
దళిత పక్షపాతి సీఎం జగన్
-వైఎస్సార్ సీపీ దళిత సంఘాల నేతలు
కూడేర(AP 39 TV న్యూస్):-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతి అని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కమ్మూరు సంగప్ప, సచివాలయ కన్వీనర్ దేవరాజ్, ఎంపీటీసీ సభ్యులు రమేష్ పేర్కొన్నారు .బుధవారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారాన్నారు. విజయవాడలో ఈ నెల 19న ప్రారంభించబడుతున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని 210 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయించడం దేశంలోనే రికార్డ్ అన్నారు. ప్రపంచంలో ఎత్తైన విగ్రహాల్లో అంబేద్కర్ విగ్రహం మూడవదిగా నిలిచిందన్నారు . 19న జరిగే విగ్రహావిష్కరణకు దళితులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో దళిత సంఘ నేతలు సంజీవ రాయుడు, మరుట్ల ఎర్రిస్వామి ,అంబేద్కర్, నాగార్జున, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, జెఎసి మండల కన్వీనర్ దేవేంద్ర , పార్టీ యూత్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు