అన్నదాతలకు అండగా సీఎం జగన్

అన్నదాతలకు అండగా సీఎం జగన్ 

-మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

 

 

కూడేరు(AP 39 TV న్యూస్):-

అన్నదాతలకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచి అన్ని విధాల ఆదుకుంటున్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కూడేరు మండల పరిధిలోని ముద్దలాపురం, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది రైతులకు వైఎస్సార్ జలకళ పథకం కింద మోటర్లు, పరికరాలు మంజూరయ్యాయి. శనివారం అనంతపురం డ్వామా కార్యాలయంలో విశ్వేశ్వర్ రెడ్డి రైతులకు మోటర్లు, పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక పథకాలను తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు వ్యవసాయాన్ని దండగ అంటే జగన్ పండగల చేశాడని ఆయన తెలిపారు. ఈ మోటర్లు పరికరాల విలువ రూ.22 లక్షలు ఉంటుందన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుని ఆర్థికంగా బలపడాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి ,వైస్ ఎంపీపీ సుబ్బమ్మ, ఏపీడి అనురాధ ,వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు పెద్దిరెడ్డి, గోపాల్ రెడ్డి, నాయకులు మంజునాథ్ రెడ్డి, ఎర్రిస్వామి, మధు, నారాయణస్వామి ,కదిరప్ప తదితరులు పాల్గొన్నారు డ్వామా సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.