“జగనన్న సురక్ష”తో ఉచితంగా సర్టిఫికెట్లు అందజేత

“జగనన్న సురక్ష”తో ఉచితంగా సర్టిఫికెట్లు అందజేత 

-తహసిల్దార్ శేషారెడ్డి , ఎంపీడీవో ఎంకే భాషా

AP 39TV,,న్యూస్ కూడేరు:

జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందివ్వడం జరుగుతుందని తహసిల్దార్ శేషారెడ్డి ,ఎంపీడీవో ఎంకే భాషా తెలిపారు మంగళవారం కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేలో 141 మంది ప్రజలు వివిధ రకాల ధ్రువీకరణల పత్రాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోగా వారందరికీ సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు . అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వారు తెలిపారు..కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ , వైఎస్ఆర్ సీపీ నేతలు కుమ్మర రామ్మోహన్ , రమేష్ నాయక్ , ఏఓ విజయ్ కుమార్ , పంచాయితీ కార్యదర్శులు శివరంజని ,రఘురాం , సచివాలయ ఉద్యోగులు , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.