అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే జగనన్న సురక్ష
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే జగనన్న సురక్ష
ఎంపీపీ నారాయణరెడ్డి
AP 39 TVన్యూస్ ,కూడేరు:
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఎంపీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం కూడేరు మండలం పి నారాయణపురంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ హనుమంత్ రెడ్డి ,మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ చౌదరి , తహసీల్దార్ శేషారెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణ్ రెడ్డి హాజరయ్యారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ప్రజలకు 11 రకాల సర్వీసులు అందించడం జరుగుతుందన్నారు . జగనన్న సురక్ష సర్వేలో ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 329 మందికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు .కార్యక్రమంలో AO విజయ్ కుమార్ ,పంచాయతీ కార్యదర్శి హరి ,సచివాలయ ఉద్యోగులు ,వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు