కరుట్లపల్లిలో జగనన్న సురక్ష
కరుట్లపల్లిలో జగనన్న సురక్ష
AP 39 TV న్యూస్ ,కూడేరు:
కూడేరు మండల పరిధిలోని కరుట్లపల్లిలో శనివారం సర్పంచ్ ఓబులమ్మ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ నారాయణరెడ్డి , అగ్రి అడ్వైజరీ మండల కమిటీ చైర్ పర్సన్ నిర్మలమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు .ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి రుసుము లేకుండా 11 రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు .ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు .సర్వేలో దరఖాస్తు చేసుకున్న 155 మందికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు .కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యురాలు పద్మావతి, డిప్యూటీ తహసిల్దార్ విశ్వనాథ్, సూపరింటెండెంట్ నాగభూషణ రెడ్డి పంచాయతీ కార్యదర్శి హరి విఆర్వో వెంకట నరసయ్య ఇతర శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు