ఇప్పేరులో “జగనన్న విద్యా కానుక కిట్లు” పంపిణీ
AP 39TV న్యూస్ కూడేరు:
కూడేరు మండల పరిధిలోని ఇప్పేరు ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సభ్యుడు రమేష్ ,సర్పంచ్ ఓబులేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు కిట్లను అందజేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులకు మహర్దశ కలిగిందన్నారు. నాడు -నేడుతో బడుల రూపు రేఖలే మారాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. దీంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు సూచించారు .కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ తిప్పేస్వామి , ప్రధానోపాధ్యాయుడు , ఉపాధ్యాయులు , పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు