జగనన్న విద్యా కానుక ఓ వరం
– సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్
AP 39TV న్యూస్ కూడేరు:
జగనన్న విద్యా కానుక పేద విద్యార్థులకు ఓవరంగా నిలుస్తోందని కూడేరు మండలం కొర్రకోడు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ పేర్కొన్నారు .సోమవారం ఆ గ్రామంలోని హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పిల్లలకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన సాగుతుందన్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపి తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్ ,వైస్ చైర్మన్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు