జగనన్న ఆరోగ్యం సురక్షకు విశేష స్పందన
చోళసముద్రంలో జగనన్న ఆరోగ్యం సురక్షకు విశేష స్పందన
కూడేరు(అక్టోబర్ 19)AP 39 TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని చోళసముద్రంలో గురువారం నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల వద్దకే వైద్య నిపుణులు రావడంతో వైద్య సేవలు పని ఎందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు .వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ మందులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణం, ఎంపీడీవో ఎంకే భాష ,ఈవోఆర్డి లక్ష్మీనరసమ్మ, వైద్యులు సరిత , లక్ష్మీనారాయణ , పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ, వైఎస్సార్ సీపీ నేతలు పెన్నోబులేసు , ఎర్రిస్వామి ,
గంగమ్మ ,గంగాధర్ ,మెడికల్ సిబ్బంది ,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు