అరవకూరులో ఘనంగా పీర్ల జలది
అరవకూరులో ఘనంగా పీర్ల జలది
కూడేరు(ఆగస్టు13)AP 39TV న్యూస్:-
కూడేరు మండలం అరవకూరులో ఆదివారం పీర్ల దేవుళ్ళ జలధి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువ జామున పీర్ల దేవుళ్ళు అగ్నిగుండ ప్రవేశం చేశారు. సాయంత్రం పీర్లు దేవుళ్ళు గుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తర్వాత డప్పుల నడుమ పీర్ల దేవుళ్ళను ఊరేగింపుగా తీసుకొని జలదికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు తమ కోర్కెలు తీరాలని పీర్ల దేవుళ్ళు ముందర పొర్లుదండాలు పెట్టారు. పిల్లలు పెద్దలు డప్పుల నడుమ చిందులు తొక్కారు. ఈ సందర్భంగా ప్రజల మధ్య తోపులాట చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు .
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు