జల్లిపల్లిలో కేదర్నాథ్ ఆలయ ఆకారంలో వినాయక మండపం
జల్లిపల్లిలో కేదర్నాథ్ ఆలయ ఆకారంలో వినాయక మండపం
-మండపం ఏర్పాటుకు రూ 30 వేలు ఖర్చు
కూడేరు(సెప్టెంబర్ 19)AP 39 TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లిలో పీఏబీఆర్ డ్యాం కు వెళ్లే రోడ్డులో కొందరు యువకులు వినాయక చవితి పురస్కరించుకొని సోమవారం ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ ఆలయ ఆకారంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపం ఆకర్షణీయంగా నిలిచింది. మండపం ఏర్పాటుకు సుమారు రూ. 30 వేలు ఖర్చు అయినట్లు నిర్వాహకులు కిరణ్ , మహేంద్ర , ఎర్రిస్వామి , చందు , గౌతమ్ తెలిపారు. మంగళవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మండపాన్ని వీక్షించి అందులో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేయించారు .నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్,
రిపోర్టర్,
కూడేరు.