జోడు లింగాల ఆలయం వద్ద గాలిగోపురాల నిర్మాణానికి భూమి పూజ

జోడు లింగాల ఆలయం వద్ద గాలిగోపురాల నిర్మాణానికి భూమి పూజ

 

-ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి

కూడేరు(ఆగస్టు 28)AP 39TV న్యూస్:-

 

కూడేరులో ప్రసిద్ధిగాంచిన శివపార్వతుల జోడి లింగాల సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద సుమారు రూ.90 లక్షలతో ఉత్తరం- దక్షిణం వైపు గాలిగోపరాలను నిర్మించడానికి బళ్లారికి చెందిన బసన్న గౌడ్ అనే భక్తుడు ముందుకు వచ్చాడు .సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు. తర్వాత దాత బసనగౌడ్ విశ్వేశ్వర్ రెడ్డికి ఇతర ప్రజాప్రతినిధులకు శాలువాలు కప్పి సత్కరించారు . జోడి లింగాలను దర్శించుకోవడం ద్వారా తనకు మేలు జరగడంతో మొక్కుగా గాలి గోపురాలను నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు దాత తెలిపారు. తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి జోడి లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి ,జెడ్పిటిసి అశ్విని , సర్పంచ్లు లలితమ్మ , రామాంజనేయులు, వైస్ ఎంపీపీ దేవా, ఈవో బాబు, గ్రామ పెద్దలు కుమ్మర ఓబులప్ప ,చంద్రశేఖర్ రెడ్డి , భక్తులు కోకా బాబు, రామచంద్రారెడ్డి, రామాంజనేయులు, ఎర్ర నాగప్ప ,మంజునాథరెడ్డి చింతల నాయుడు, సుబ్బయ్య,అర్చకులు శివ శంకర్ శాస్త్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.