జర్నలిస్టు అందరూ ఒకే వేదిక పైకి రావడం ఎంతో ఆనందంగా ఉంది

జర్నలిస్టు అందరూ ఒకే వేదిక పైకి రావడం ఎంతో ఆనందంగా ఉంది

మచ్చ రామలింగారెడ్డి కృషి అభినందనీయం

సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

రాష్ట్రస్థాయి క్రికెట్ టోపీలను

ఆవిష్కరించిన కలెక్టర్ అరుణ్ బాబు

రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరూ క్రికెట్ టీం గా వచ్చి ఇక్కడ టోర్నమెంట్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఇది జర్నలిస్టు ఐక్యతకు నిదర్శనమని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు అనంతపురం నగరంలో ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ యూనిటీ కప్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు కొద్దిగా పని ఒత్తిడి నుంచి ఉపశనం కలుపుతుందన్నారు అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం కృషి చేసిన మచ్చ రామలింగారెడ్డి కృషి అభినందనీయమన్నారు అనంతపురం జిల్లా నుంచి రంజి ట్రోఫీకి ఎంపికైన మచ్చ దత్తారెడ్డికి అభినందించారు రంజిత్రోఫీతోనే కాకుండా జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టు క్రికెట్ టీం లకు మెడల్స్ మరియు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లకు ట్రోఫీలను అందజేశారు

 

దత్త రెడ్డి ను సన్మానించిన కలెక్టర్

అనంతపురం నుంచి రంజిత్రోఫీకి ఎంపికైన మచ్చ దత్తారెడ్డిని కలెక్టర్ అభినందిస్తూ ఆర్ డి టి స్టేడియంలో సన్మానించారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అభిలాషించారు కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ

 

క్రికెట్ ఆడిన కలెక్టర్

సత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు క్రికెటర్ కూడా కావడం విశేషం కార్యక్రమంలో భాగంగా రంజీ ట్రోఫీ క్రీడాకారుడు దత్తారెడ్డి బౌలింగ్ కలెక్టర్ అరుణ్ బాబు బ్యాటింగ్ చేశారు అనంతరం ఏపీ డబ్ల్యూ ఆధ్వర్యంలో కలెక్టర్కు చిరు సన్మానం నిర్వహించారు

 

క్రికెట్ అభివృద్ధి

క్రికెట్ అభివృద్ధి కోసం మచ్చ రామలింగారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని సత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. సత్య సాయి జిల్లా నుంచి తాను కూడా ఒక టీంను సిద్ధం చేసుకుని మ్యాచ్ ఆడదామని కలెక్టర్ మచ్చ రామలింగారెడ్డి తో అన్నారు.

Leave A Reply

Your email address will not be published.