కమ్మూరులో విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం
AP 39TV న్యూస్,కూడేరు:
కూడేరు మండలం కమ్మూరులో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు .ఆయనకు మహిళలు హారతులు పట్టగా వైయస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి ,టపాసులు పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ఆయన గడపగడపకు వెళ్ళగా ప్రజలు నీరాజనం పలికారు. సార్ తమకు ఫలానా సంక్షేమ పథకం ద్వారా ఇంత లబ్ధి చేకూరిందని, మరికొందరు సార్ వేకువ జామునే వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్ నగదు అందజేస్తున్నారని సంతోషంగా చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ,ప్రజా సంక్షేమానికి అహార్నిశలు కృషి చేస్తున్న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ప్రజలను కోరారు. కమ్మూరు గ్రామానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ.16 కోట్లు, తారు రోడ్డు ,సిమెంట్ రోడ్ను సుమారు రూ.3 కోట్లుతో చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షాల , పచ్చ పత్రికల ఆసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి ,ఎంపీపీ నారాయణరెడ్డి , వైస్ ఎంపీపీ సుబ్బమ్మ , దేవా ,వైఎస్సార్ సీపీ నేతలు సంగప్ప , వన్నూరప్ప, సుబ్బారెడ్డి ,రామకృష్ణ , నారాయణస్వామి , సదాశివరెడ్డి ,బైరెడ్డి రామచంద్రారెడ్డి , తుప్పటి హరీష్ , మదన్ మోహన్ రెడ్డి , హనుమంత్ రెడ్డి ,కృష్ణారెడ్డి నిర్మలమ్మ , వెంకటరామిరెడ్డి శంకరయ్య మంజునాథ్ రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు