కమ్మూరులో “జగనన్న ఆరోగ్య సురక్ష “కు విశేష స్పందన
కమ్మూరులో “జగనన్న ఆరోగ్య సురక్ష “కు విశేష స్పందన
కూడేరు (అక్టోబర్ 6)AP 39 TV న్యూస్:-
కూడేరు మండలం కమ్మూరులో శుక్రవారం సర్పంచ్ రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 350 మంది ప్రజలు శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు .వైద్య నిపుణులు అవసరమైన వారందరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వారి ఆరోగ్య సమస్యలకు తగు సలహా సూచనలు అందించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. ఎంపీపీ నారాయణరెడ్డి సర్పంచ్ రంగారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష భరోసాని ఇస్తుందన్నారు ప్రజలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు దేవా అరవకూరు సర్పంచ్ రామాంజనేయులు , మండలం ప్రత్యేక అధికారి సత్యనారాయణ చౌదరి,తహసిల్దార్ శేషారెడ్డి , ఎంపీడీవో ఎంకే భాషా ,వైద్యులు లక్ష్మీనారాయణ, సరిత , పంచాయతీ కార్యదర్శి మురళి, వైయస్సార్ సిపి మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, కమ్మూరు గ్రామ వైయస్సార్ సిపి నేతలు, వైద్య ,సచివాలయ, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు